- బహిరంగ చర్చకు వెళ్తున్న ధన్‌పాల్‌సూర్యనారాయణ అడ్డగింత
- సవాళ్లు విసిరితే చర్యలుంటాయని బిగాల గణేశ్‌కు అల్టిమేటం
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్అర్బన్సెగ్మెంట్లో పాలిటిక్స్ హీటెక్కాయి. బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్‌సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్యే, బీఆర్ఎస్అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా సవాళ్లు, ప్రతిసవాళ్లతో సోమవారం జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కంఠేశ్వర్శివాలయం వేదికగా చర్చకు సిద్ధపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ధన్పాల్సూర్యనారాయణను అడ్డుకున్నారు. ఇలాంటి సవాళ్లు చేస్తే కేసులు పెడతామని గణేశ్‌గుప్తాకు వార్నింగ్ఇచ్చారు.
శుక్రవారం రాత్రి బీఆర్ఎస్అర్బన్కార్యకర్తల మీటింగ్‌లో గణేశ్‌గుప్తా తన ప్రత్యర్థి ధన్పాల్సూర్యనారాయణపై ఆరోపణలు చేశారు. పదేండ్లుగా తాను అభివృద్ధి చేయలేదంటున్న ధన్పాల్బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సవాల్ స్వీకరించిన ధన్‌పాల్‌సూర్యనారాయణ, గొప్ప నిర్మాణాలు చేపడతామని పాత కలెక్టరేట్, డ్వాక్రా బజార్ బిల్డింగ్నేలమట్టం చేసి తొంగి చూడకపోవడం డెవలెప్మెంట్అవుతుందా?, కాంట్రాక్టుల్లో కమీషన్లు, దళితబంధు మంజూరుకు వాటాల వసూళ్లు నిరూపిస్తానని శనివారం మీడియా ముందు చెప్పారు.
ALSO READ : బషీరాబాద్‌లో కరెంట్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి
సోమవారం కంఠేశ్వర శివాలయం వద్దే తేల్చుకుందాం రమ్మంటూ సై అన్నారు. దీంతో సోమవారం రోజంతా సిటీలో టెన్షన్వాతావరణం నెలకొంది. పోలీసుల హెచ్చరిక నేపథ్యంలో ధన్‌పాల్‌తో చర్చకు ఫుల్స్టాప్పెడుతున్నానని, ఇక నుంచి ఆయనపై పర్సనల్ఆరోపణలు చేయనని ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా ప్రకటించి వెళ్లిపోయారు. ధన్పాల్మాట్లాడుతూ.. గెలుపు దిశగా దూసుకెళ్తున్న తన ప్రచారాన్ని ఆపడానికి కుట్ర చేశారన్నారు.