కామారెడ్డి, వెలుగు: హాత్‌సే హాత్‌జోడో యాత్ర ఎఫెక్ట్‌తో కామారెడ్డి జిల్లా పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తున్నాయి. పాదయాత్రలో భాగంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్స్‌లో పీసీసీ చీఫ్రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ లీడర్లు అడ్డుకునేందుకు యత్నించగా, కాంగ్రెస్ లీడర్లు కూడా తగ్గేదేలే అన్నట్లుగా ముందుకెళ్లారు. రేవంత్‌రెడ్డి కూడా తనదైన శైలిలో విమర్శలకు పదును పెట్టి, కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆ వెంటనే బీఆర్ఎస్ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి.. కాంగ్రెస్ లీడర్ల వ్యాఖ్యలను ఖండించారు. అదే క్రమంలో తాజాగా గంప గోవర్ధన్, షబ్బీర్‌అలీ నియోజవర్గానికి ‘నువ్వేం చేశావంటే.. మంత్రిగా నువ్వేం చేశావో’ చెప్పాలంటూ సవాళ్లు విసురుకుంటున్నారు.
చార్జిషీట్లు, ఘాటైన విమర్శలు
రేవంత్‌రెడ్డి పాదయాత్రలో జిల్లాలోని అన్ని నియోజక వర్గాల ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై చార్జిషీట్రిలీజ్ చేశారు. స్థానికంగా ప్రజలను ఆకట్టుకోవడం, క్యాడర్లో జోష్ నింపేందుకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై ఘాటైన విమర్శలు కూడా చేశారు. దీనికి ప్రతిగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సీనియర్నేతలే టార్గెట్‌గా విరుచుకుపడుతున్నారు. వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు.
షబ్బీర్ అలీ వర్సెస్ గంప గోవర్ధన్
ఈ నెల 18న కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర జరిగింది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో పీసీసీ చీఫ్ స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కిరాయి ఇంట్లో ఉన్న వ్యక్తికి ఇంత భారీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. మరోసారి మాస్టర్ ప్లాన్ పేరిట రైతుల భూములు లాక్కుంటారని ఆరోపించారు. దీనికి స్పందనగా బీఆర్ఎస్యువజన విభాగం ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌అలీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇదే క్రమంలో ఇటీవల బీఆర్ఎస్మాచారెడ్డి మండల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మాజీ మంత్రి షబ్బీర్‌అలీ సొంత మండలం మాచారెడ్డి కావడంతో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. షబ్బీర్‌అలీ హయాంలో ఆయన సొంత మండల అభివృద్ధికి ఏమి చేయలేదని, ఆయన కుటుంబ సభ్యుల, అనుచరుల ఆస్తుల పెంచుకునేందుకే సమయం సరిపోయిందని గంప గోవర్ధన్ ఆరోపణలు చేశారు. షబ్బీర్‌అలీ .. తన ఆస్తులపై చర్చ పెడదామా అంటూ సవాల్ విసిరారు. దీంతో రెండు పార్టీల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీనికి ప్రతిగా డీసీసీ ప్రెసిడెంట్ మీడియా సమావేశం నిర్వహించి గంప గోవర్ధన్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. గోవర్ధన్ అభివృద్ధి ని పక్కన పెట్టి పర్సంటేజీల కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. దోమకొండకు ఒక డిగ్రీ కాలేజీ కూడా సాధించలేకపోయారని విమర్శించారు.
2018 ఎన్నికలకు ముందు..
2018 ఎన్నికలకు ముందు కూడా గంప గోవర్ధన్, షబ్బీర్‌అలీ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో వ్యక్తి గత విమర్శలు చేసుకున్నారు. అప్పట్లో జిల్లా కేంద్రంలోని గంజులో గాంధీ విగ్రహం ఎదుట ఎవరికి వారుగా తమ ఆస్తులను వెల్లడించారు. మళ్లీ ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుందా..? అంటూ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.