- దొర పన్నిన కుట్రలో అక్కలు బందీలు
- సీతక్కను అవమానించడమేనా మీ నీతి?
- దళితుల ముందు కూర్చోవడం ఇష్టం లేక, అధ్యక్షా అనలేక కేసీఆర్ సభకు వస్తలేడని సీఎం రేవంత్ ఫైర్
చెల్లెలు జైల్లో ఉంటే రాజకీయాల కోసం తాను బజార్ లో తిరిగేటోన్ని కాదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘‘సొంత చెల్లెల్ని జైల్లో పెడ్తే ఢిల్లీ వెళ్లి రాజకీయ ఒప్పందం చేసుకున్న నీచులు వాళ్లు.. అక్కా మీరు వాళ్ల ఉచ్చులో పడొద్దు. దొర పన్నిన కుట్రలో మా అక్కలు బందీలైన్రు.. అక్కల క్షేమం కోరే చెబుతున్నా... వాళ్ల ఉచ్చులో పడొద్దు’’ అని సూచించారు.
బీఆర్ఎస్ నేతలకు రాజకీయ ప్రయోజనం తప్ప.. ప్రజల ప్రయోజనం పట్టదన్నారు. రైతు రుణమాఫీపై చర్చ జరగకూడదని బీఆర్ఎస్ నేతలు.. ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘సబిత, సునీతను సొంత అక్కలుగానే భావించా. ఒక అక్క నన్ను నడిబజారులో వదిలేసినా ఏం అనలేదు. ఇంకొక అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లాను. అప్పటి కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నా. ప్రచారానికి వచ్చిన తమ్ముడిపై కేసులు ఎత్తివేయాలని ఎప్పుడైనా చెప్పారా?’’ అని ప్రశ్నించారు.
పార్టీని వదిలివెళ్లిన వారిలో ఒకరు మహిళా కమిషన్చైర్మన్ పదవి తెచ్చుకున్నారని, ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారని తెలిపారు. తన కుటుంబ సభ్యురాలు సీతక్క పట్ల బీఆర్ఎస్వాళ్లు అవమానకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. సీతక్కను అవమానించేలా సోషల్ మీడియాలో మీమ్స్పెట్టడమేనా మీ నీతి? అని ప్రశ్నించారు. ఆదివాసీ ఆడబిడ్డను అవమానిస్తరా? అని ఫైర్ అయ్యారు. ‘‘ఎవరి ఉచ్చులోనో పడి తప్పుదోవ పడుతున్న అక్కలకు నేను చెబుతున్నది ఒక్కటే.. మీరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెలే తీహార్ జైలులో ఉన్నారు.
తమను అరెస్టు చెయ్యవద్దని అవసరమైతే తమ చెల్లెలును ఏడాది పాటు జైలులో ఉంచమని వాళ్లు బేరసారాలు చేసుకున్నారు” అని అన్నారు. ‘‘సబిత, సునీత కోసం కొట్లాడింది నేను. మహిళలను నేను గౌరవిస్తాను. నన్ను నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందువరుసలో ఉన్నారు. ఆ తమ్ముడిని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారు. జైళ్లో ఉన్న సొంత చెల్లి గురించి మాట్లాడరు. రైతు రుణమాఫీని దెబ్బ తీసి, స్కిల్వర్సిటీ ఆలోచనను అడ్డుకునేందుకు యత్నించారు” అని మండిపడ్డారు.