- అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు
కాగజ్‌నగర్, వెలుగు : ఆసిఫాబాద్‌జిల్లా కౌటాల జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన171 పోలింగ్ కేంద్రంలోకి కొందరు ఓటర్లు బీజేపీ క్యాండిడేట్ గొడం నగేశ్ ఫొటోతో ఉన్న పోల్ చిట్టీలు తీసుకొని వచ్చారు. దీన్ని గమనించిన కాంగ్రెస్ లీడర్లు వారిని అడ్డుకున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా, ఎన్నికల కమిషన్ రూల్స్‌కు విరుద్ధంగా క్యాండిడేట్ ఫొటోతో ఉన్న పోల్ చిట్టీలు పంచడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఓటింగ్సిబ్బంది ఓటర్ల నుంచి పోల్ చిట్టీలు తీసుకొని, బీఎల్‌వోలతో వేరే పోల్ చిట్టీలు అందించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ పుష్పలత పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. బీఎల్‌వోలు పోల్ చిట్టీలు పంచకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ తహసీల్దార్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు