మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కు బ్రేక్ పడింది. దీంతో ఓటర్లు క్యూలో పడిగాపులు కాస్తున్నారు. మహిళా ఓటర్లు పోలింగ్ కేంద్రం దగ్గర పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. క్యూలో నిలబడలేక కొందరు మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాల ముందే సేద తీరాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
సంస్ధాన్ నారాయణపురం మండలం అల్లందేవి చేరువులో కూడా పోలింగ్ నిలిచిపోయింది. అక్కడ కూడా ఈవీఎంలు మొరాయించాయి. మిగితా చోట్ల ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈనెల 6వ తేదీన ఫలితం వెలువడనుంది.