
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముగిసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 5 గంటల వరకు పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ ముగిసే సమయానికి క్యూ లైన్లలో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్. రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం పైగా పోలింగ్ నమోదైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగిసింది. అయితే 4గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.
మరోవైపు నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ మరో గంటపాటు కొనసాగనుంది.