- ఎనుమాముల మార్కెట్‍కు చేరిన ఈవీఎంలు
వరంగల్/ హనుమకొండ/ మహబూబాబాద్, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వరంగల్ ఎస్సీ, మహబూబాబాద్ ఎస్టీ రిజర్వేషన్ పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గత లోక్‍సభ ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. 2019 ఎంపీ ఎన్నికల్లో వరంగల్ స్థానంలో 63.32 శాతం నమోదవగా ఈసారి...... ఇక మహబూబాబాద్ స్థానంలో అప్పుడు 68.97 శాతం ఉండగా, ఇప్పుడు..... నమోదైంది.
ఆదివారం రాత్రి కురిసిన వర్షం కారణంగా సోమవారం వాతావరణం చల్లగా ఉండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. భూపాలపల్లిలో 4 గంటలకు పోలింగ్ ముగియగా, ఇతరచోట్ల 6 గంటలలోపు ఓటింగ్‍సెంటర్లకు వచ్చినవారికి అధికారులు ఓటేసేందుకు అవకాశమిచ్చారు. మొత్తంగా ఈవీఎం మిషన్లు వరంగల్ ఎనుమాముల మార్కెట్‍లోని స్ట్రాంగ్ రూంలకు చేరాయి. సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్త్పహారా ఏర్పాటు చేశారు.
అక్కడక్కడ మొరాయించిన ఈవీఎంలు..
వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ పాఠశాలలో 208 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. ఈ క్రమంలో గంటదాటినా సిబ్బంది సమస్యను పరిష్కరించకపోవడంతో ఓటర్లు ఇంటిదారి పట్టారు. నెక్కొండ మండలం రెడ్లవాడ 259 పోలింగ్ సెంటర్లో సైతం ఈవీఎం పనిచేయకపోవడంతో ఓటర్లకు ఎదురుచూపు తప్పలేదు.
ఎన్నికల సమయంలో గ్రేటర్ వరంగల్ డిప్యూటీ మేయర్ రిజ్వానా భర్త మసూద్ డబ్బులతో తిరుగుతున్నాడని, మిల్స్‌కాలనీ పోలీసులు స్టేషన్ తరలించారు. రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ ప్రావీణ్య వరంగల్ కలెక్టరేట్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.
ఓటు వినియోగించుకున్న అభ్యర్థులు, తదితరులు..
వరంగల్ లోక్‍సభ పరిధిలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు కడియం కావ్య, అరూరి రమేశ్, మారేపల్లి సుధీర్ కుమార్‍తో పాటు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, వరంగల్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ ప్రావీణ్య, హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, సినీ కమెడియన్ రచ్చ రవి తదితరులున్నారు.
ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖలు
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలో సోమవారం ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని తొర్రూరు పట్టణ కేంద్రంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కురవి మండలం మాధవపురంలో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహయం రఘురామరెడ్డి, కురవి మండలం పెద్దతండాలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్,మరిపెడ మండలం సీతరాంపురంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్, జిల్లా కేంద్రంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్,మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్,కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
ఎస్పీ రాంనాద్ కేకన్, కాంగ్రెస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్ధి పోరిక బలరాం నాయక్, బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లిరవీందర్ రావు,మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, చిన్నగూడురు మండలం ఉగ్గంపల్లిలో మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్, పెద్దవంగర మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య, సీరోలు మండలంలో మాజీ ప్రభుత్వ సలహ దారుడు రామచంద్రు నాయక్,మహబూబాబాద్‌లో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి,తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.