సింగరేణి ఎన్నికల పోలింగ్ షురూ

సింగరేణిలో ‘గుర్తింపు కార్మిక సంఘం’ హోదా కోసం పోలింగ్ మొదలైంది. ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు  జరగనుంది.  రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 ప్రాంతాల్లో  84  పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.  బరిలో  13 కార్మిక సంఘాలు ఉండగా 39 వేల 775 మంది  కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఎనిమిది కౌంటింగ్‌‌‌‌  కేంద్రాల్లో రాత్రి7 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 9వేల కు పైగా ఓటర్లు ఉన్న శ్రీరాంపూర్​ నుంచి తుదిఫలితం వస్తుంది.   ఈ ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్​టీయూసీ నడుమ హోరాహోరీ పోటీ  నడువనుంది.  ఈ రెండు యూనియన్లకు బలమైన క్యాడర్ ఉండడం, మాతృపార్టీల లీడర్లు ముమ్మర ప్రచారం నిర్వహించడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.