దేశంలో ఎన్నికల పండగ ముగిసింది.లోక్ సభ ఏడో విడత ఎన్నికల పోలింగ్ శనివారం (జూన్ 1) ప్రశాంతంగా ముగియడంతో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియకు తెరపడింది. ఇక మిగిలింది ఫలితాలే..జూన్ 4న ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 102 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 66.14శాతం పోలింగ్ నమోదైంది. రెండో ఫేజ్ లో 89 స్థానాలకు ఏప్రిల్ 26న ఎన్నికలు జరగగా.. 66.71 శాతంపోలింగ్ నమోదైంది. మూడో విడతలో మే 7న 94 స్థానాలకు, నాలుగో విడతలో మే 13న 96 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 65, 69 శాతం పోలింగ్ నమోదైంది.మే 20న 49 స్థానాలకు ఐదో విడత, మే 25న 57 స్థానాలకు ఆరో విడత ఎన్నికలయ్యాయి. ఐదో విడతలో 62శాతం ఓటింగ్ నమోదు కాగా.. ఆరో విడతలో 62శాతం నమోదైంది. ఇక చివరి విడతలో దాదాపు 60శాతం నమోదైనట్లు తెలుస్తోంది. మొత్తం 545 స్థానాలకు ఇవాళ్టితో పోలింగ్ ముగిసింది.
ఏడో విడత పోలింగ్ లో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. కాగా 6 గంటలకు ముందుకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం.
ఏడో దశ(7th Phase) లో పంజాబ్ లో 13 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్ లో 4, పశ్చిమబెంగాల్ లో 9, బీహార్ -8, ఒడిశా -6, జార్ఖండ్ -3, ఛండీగఢ్ -1 స్థానానికి ఓటింగ్ జరిగిం ది. 7 ఫేస్ లో ఒడిశా అసెంబ్లీలో మిగిలిన 42 స్థానాలతోపాటు, హిమాచల్ ప్రదేశ్ లో ఆరు స్థానాల ఉప ఎన్నికలకు ఓటింగ్ జరిగింది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణ లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో ఈ స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు.