పలు గ్రామాల్లో నిలిచిపోయిన పోలింగ్.. ఓట్లు వేయమంటున్న గ్రామస్తులు

ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఇచ్చోడ మండలం బావోజిపేట గ్రామంలో పోలింగ్ నిలిచిపోయింది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించారు. గ్రామానికి   రోడ్డు వేయాలని, త్రిఫేజ్ విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులతో చర్చించేందుకు అధికారలు రంగంలోకి దిగారు. ఓటేసేందుకు తాము రామని గ్రామంలో అభివృద్ధి చేసిన తర్వతే ఓట్లు వేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే అధికారులు ఇంకా గ్రామస్తులతో చర్చిస్తున్నారు.  

మరోవైపు నాగర్ కర్నూల్ జిల్లాలోనూ ఇదే తంతు నడిచింది. కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడెం చెంచులు ఓట్లు వేయకుండా బహిష్కరించారు. మూడు రోజుల నుంచి కరంట్ లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్న మని నిరసన తెలిపారు. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఫైర్ అయ్యారు.చెంచుగూడెంలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓట్లు బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. దీంతో విద్యుత్ అధికారులు హుటాహుటిన చెంచు గూడెంకు చేరుకున్నారు.