మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 230 స్థానాలనకు ఎన్నికలు జరుగుతుండగా, ఛత్తీస్‌గఢ్‌లోని 70 స్థానాలకు రెండో విడత పోలింగ్ జరుగుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశలో 76.47 శాతం ఓటింగ్ జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రతి పోలింగ్ బూత్ వద్ద భారీ భధ్రతను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 03న ఫలితాలు వెలువడనున్నాయి.
ప్రధాని మోదీ ట్వీట్..
మధ్యప్రదేశ్ లో ఓటింగ్ కు ముందు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోని ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేయాలని, ఈ గొప్ప ప్రజాస్వామ్య పండుగకు మరింత అందాన్ని ఇస్తారని నమ్ముతున్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేసిన రాష్ట్ర యువతకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి ఓటు వేయండి.
మీ ఒక్క ఓటు యువత, రైతులు, మహిళల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దయచేసి ఓటు వేయడానికి మీ ఇళ్ల నుండి బయటకు రండి. ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి ఓటు వేయండి అంటూ ఆ రాష్ట్ర సీఎం భూపేష్ బఘేల్ తెలిపారు.