గ్రేటర్ ఎన్నికల్లో కిలోమీటర్​లోపే పోలింగ్‌‌ కేంద్రం

గ్రేటర్ ఎన్నికల్లో కిలోమీటర్​లోపే పోలింగ్‌‌ కేంద్రం

ఆఫీసర్లకు ఎన్నికల కమిషనర్‌‌ ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు : నగర ఓటర్ల ఇంటికి కిలోమీటర్ దూరంలోనే పోలింగ్‌‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌ పార్థసారథి ఆఫీసర్లను ఆదేశించారు. జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల ఫొటో ఎలక్టోరల్‌‌ రోల్స్‌‌ ప్రకటన, పోలింగ్‌‌ కేంద్రాల గుర్తింపుపై ఆదివారం ఎస్‌‌ఈసీ ఆఫీసు నుంచి జీహెచ్‌‌ఎంసీ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్‌‌ ద్వారా మాట్లాడారు. కరోనా నేపథ్యంలో విశాలమైన హాళ్లు, గదులు, ప్రభుత్వ, సెమీ గవర్నమెంట్‌‌ భవనాల్లోనే పోలింగ్‌‌ స్టేషన్‌‌లు ఏర్పాటు చేయాలన్నారు. టీ–- పోల్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌లోని ఈఆర్‌‌ఎంఎస్‌‌ మాడ్యూల్స్​ ప్రకారం ఓటర్ల జాబితా తయారు చేయాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాలోని సంఖ్యను జీహెచ్‌‌ఎంసీ డివిజన్లలో ఓటర్ల సంఖ్యతో డిప్యూటీ కమిషనర్లు సరిచూసుకోవాలని పార్థసారథి సూచించారు. డివిజన్ల వారీ ఓటర్ల జాబితాలో ఎవరివైనా పేర్లు లేకపోతే ఈఆర్వోలకు ఫారం–6 ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.