వచ్చేస్తోంది : 8 లేదా 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్

మరో రెండో రోజుల్లో  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది..   రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 8న లేదా 10న వెలువడనున్నట్లు జాతీయా మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే  నవంబర్ రెండో వారం లేదా  డిసెంబర్ మొదటి వారంలోపు  ఎన్నికలు.. డిసెంబర్ 10 నుంచి 15 మధ్య ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుందని తెలుస్తోంది.

ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో  పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇటీవల మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించింది. పలు పార్టీలు, అధికారులతో భేటీ ఎన్నిక నిర్వహణపై చర్చించింది. ఇవాళ ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది.  అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై వీరితో చర్చించి ఏ క్షణమైనా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను  రిలీజ్ చేయనుంది.

 తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్,మిజోరంలో ఒకే విడుతలో ఎన్నిలు నిర్వహించి.. ఛత్తీస్ ఘడ్ లో రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.