ఢిల్లీలో పొల్యూషన్ డేంజర్ బెల్స్

ఢిల్లీలో పొల్యూషన్ డేంజర్ బెల్స్

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోతుందని హెచ్చరించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్యాలిటీ ఇండెక్స్ (AQI) 295కి పడిపోయింది. దేశ రాజధానిలోని పలు మానిటరింగ్ స్టేషన్లలో AQI 320 నమోదయ్యాయి. ఆనంద్ విహార్, బవానా, ద్వారక, జహంగీర్‌పురి, ముండ్కా, నరేలా, పట్‌పర్‌గంజ్, రోహిణి, షాదీపూర్, సోనియా విహార్ మరియు వజీర్‌పూర్ వంటి స్టేషన్‌లు రెడ్ జోన్‌లో కొనసాగుతున్నాయి. పంట వ్యర్థాలు కాల్చడం, పారిశ్రామిక వాడల నుంచి వచ్చే విషవాయువులతో ఢిల్లీ నగరం కాల్యుష్య కోరల్లో చిక్కుకుంటుంది.

ఆనంద్ విహార్ కాలనీలో 378, ఇందిరా గాంధీ విమానాశ్రయంలో 319, అలీపూర్ 322,  ద్వారక 324, బవానా 350, ధ్యాన్ చంద్ స్టేడియం 328 లుగా AQI ఎయిర్ క్వాలిటి ఇండెక్స్ ఉంది. సెంట్రల్ వాచ్‌డాగ్ ప్రకటించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) రెండవ దశ, కాలుష్య కంట్రోల్ రూల్స్ ఢిల్లీలో అక్టోబర్ 22 నుంచే అమలులోకి రానున్నాయి. ఢిల్లీ పరిసర రాష్ట్రాలు హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ లలో కూడా క్రమంగా పొల్యూషన్ పెరిగుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా ఎయిర్ పొల్యూషన్ స్థాయి పెరిగిపోయింది. IIT కాన్పూర్ ప్రొఫెసర్ SN త్రిపాఠి ఢిల్లీలో గాలి నాణ్యత గత వారంలో క్షీణించింద ఇటీవల చేసిన అధ్యయనంలో తేల్చి చెప్పారు.

WATCH | A layer of smog engulfs Kartavya Path and surrounding areas of Delhi as the AQI drops to 328, categorised as ' Very Poor' according to the CPCB pic.twitter.com/nz8gKhxH2P