లీడర్ల నుంచి ఆఫీసర్ల దాకా గద్దర్ కు నివాళి

లీడర్ల నుంచి ఆఫీసర్ల దాకా గద్దర్ కు నివాళి
  •     గద్దర్‌కు నాయకులు, సినీ ప్రముఖులు, అధికారుల నివాళులు
  •     కిక్కిరిసిన ఎల్బీ స్టేడియం లీడర్ల నుంచి ఆఫీసర్ల దాకా నివాళి

హైదరాబాద్‌‌, వెలుగు : ప్రజా గాయకుడు గద్దర్ కు రాజకీయాలకు అతీతంగా నివాళులు అర్పించారు. పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యమకారులు, సాహితీవేత్తలు, సినీ ప్రముఖులు, బ్యూరోక్రాట్‌‌లు సోమవారం ఉదయం ఎల్బీ స్టేడియానికి తరలి వచ్చి గద్దర్ భౌతికకాయానికి అంజలి ఘటించారు. కవులు, కళాకారులు, గద్దర్​అభిమానులతో ఎల్బీ స్టేడియం కిక్కిరిసి పోయింది. కళాకారులు  నృత్యాలు చేస్తూ గద్దర్ పాటలతో హోరెత్తించారు. సినీ ప్రముఖులు మోహన్ బాబు, ఆర్‌‌  నారాయణమూర్తి,  నాగబాబు, కీరవాణి, దర్శకుడు శంకర్, రచయిత పరుచూరి వెంకటేశ్వర్​రావు, అలీ, మంచు మనోజ్, నిహారిక, కిన్నెరమెట్ల మొగిలయ్య  తదితరులు గద్దర్ కు నివాళి అర్పించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిశోర్ తదితరులు గద్దర్‌‌ కు నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

నేతల ఘన నివాళి..

అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి,  సుప్రీం కోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌‌రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్‌‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్​, జగదీశ్​ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌‌ కె లక్ష్మణ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌ రెడ్డి,  మాజీ మంత్రి శంకర్​రావు, కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్​, జానారెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, జీవన్​రెడ్డి, సీతక్క, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రఘునందన్ రావు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్​ మోతె శ్రీలత, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, బీఎస్పీ స్టేట్​చీఫ్​ ఆర్‌‌ఎస్‌‌ ప్రవీణ్‌‌కుమార్‌‌, టీఎస్‌‌ఎంఐడీసీ చైర్మన్‌‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌‌, అలయ్‌‌ బలాయ్‌‌ చైర్మన్‌‌, బీజేపీ నాయకురాలు బండారు విజయలక్ష్మి గద్దర్‌‌ పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్‌‌  ఆట, పాటతో పాటు చేసిన పోరాటాన్ని, ఆయన పాట ద్వారా యువతలో నింపిన సమరోత్సాహాన్ని ఈ సందర్భంగా పలువురు  గుర్తుచేసుకున్నారు.