నేటి నుంచి పాలిసెట్ అప్లికేషన్లు.. మే 13న ఎంట్రెన్స్ ఎగ్జామ్

నేటి నుంచి పాలిసెట్ అప్లికేషన్లు.. మే 13న ఎంట్రెన్స్ ఎగ్జామ్

హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్ కాలేజీలలో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ దరఖాస్తుల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. వచ్చే నెల 19వ తేదీ వరకు అప్లికేషన్లకు అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.250, ఇతర విద్యార్థులకు రూ.500 ఫీజుగా నిర్ణయించారు. రూ.100 ఫైన్​ తో ఏప్రిల్ 21 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు టెక్నికల్ బోర్డు సెక్రటరీ పుల్లయ్య చెప్పారు.

మే13వ తేదీన పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పరీక్షలు పూర్తయిన 12 రోజుల తర్వాత రిజల్ట్ ఇస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు www.polycet.telangana.gov.in లేదా 80314 04549 నంబర్ను సంప్రదించవచ్చని సూచించారు.