- విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించడమే కారణం
యాదగిరిగుట్ట, వెలుగు : విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించిన జూనియర్ అసిస్టెంట్ పై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో వీఆర్ఓగా పనిచేసిన డి.శ్రీనివాస్ ను ప్రభుత్వం సర్దుబాటులో భాగంగా గతేడాది యాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్ గా నియమించింది. ఈయన జూనియర్ అసిస్టెంట్ డ్యూటీతో పాటు బాలురు, బాలికల హాస్టల్ లో డే మ్యాట్రన్(సూపర్ వైజర్)గా కూడా విధులు నిర్వర్తిస్తున్నాడు.
బుధవారం సాయంత్రం హాస్టల్ లో ఉండే ఓ బాలిక చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడంతో.. ఆ బాలిక తల్లిదండ్రులతో కలిసి ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ తర్వాత అతడిని సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణ కోసం ఆదేశించామని ప్రిన్సిపాల్ షఫియాజ్ అక్తర్ తెలిపారు. విచారణ నివేదిక రాగానే ఉన్నతాధికారుల ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామన్నారు.