దైవ దర్శనానికి వెళ్లి డ్యామ్‌‌‌‌లో పడి స్టూడెంట్‌‌‌‌ మృతి

దైవ దర్శనానికి వెళ్లి డ్యామ్‌‌‌‌లో పడి స్టూడెంట్‌‌‌‌ మృతి

జమ్మికుంట, వెలుగు: బర్త్‌‌‌‌ డే సందర్భంగా ఏపీలోని శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు వెళ్లి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు డ్యామ్‌‌‌‌లో పడి కరీంనగర్ జిల్లాకు చెందిన  యువకుడు  చనిపోయాడు. కుటుంబసభ్యులు తెలిపిన  ప్రకారం..  జమ్మికుంట మున్సిపల్ పరిధి మోత్కులగూడెంకు చెందిన సాగర్ల సాయితేజ(19) హైదరాబాద్‌‌‌‌లో పాలిటెక్నిక్ సెకండియర్‌‌‌‌‌‌‌‌ చదువుతున్నాడు.

బుధవారం తన బర్త్ డే  సందర్భంగా ఫ్రెండ్స్ తో  కలిసి శ్రీశైలం వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు. గురువారం  దర్శనానికి వెళ్లేందుకు స్నానం చేస్తుండగా డ్యామ్ లో జారి పడి చనిపోయినట్లు కుటుంబసభ్యులు  తెలిపారు..