సంక్రాంతి కానుక : బ్రౌన్ రైస్, షుగర్ ఓకే.. డబ్బులు ఇస్తారా.. ఇవ్వరా..?

సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి పండుగను పెద్ద ఎత్తున జరుపుకునేందుకు సిద్దమవుతున్నారు.. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ప్రజలు ఘనంగా పండగ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈక్రమంలో తమిళనాడు లాంటి రాష్ట్రప్రభుత్వాలు కూడా పేద ప్రజలకు సంక్రాంతి గిఫ్టులను పంచుతున్నారు.  

తమిళనాడు ప్రభుత్వం ప్రతియేటా రాష్ట్రంలోని పేద ప్రజలకు సంక్రాంతి పండుగ గిఫ్టులను పంచుతుంది..అందులో భాగంగా ఈ ప్యాక్ లో కిలో బ్రౌన్ రౌస్, కిలో షుగర్, చెరుకు గడలు పంచుతోంది. దీంతోపాటు నగదు కూడా ఇస్తోంది. 

ప్రతియేటా పంచుతున్నట్లే.. 2025 సంక్రాంతికి కూడా సీఎం ఎంకే స్టాలిన్ ప్రభుత్వం..2.20 కోట్ల ప్రజలకు సంక్రాంతి పండుగ గిఫ్ట్ ప్యాక్ లను పంపిణీ ప్రారంభించింది. పొంగల్ కానుక ప్యాకేజీలకు సంబంధించిన టోకెన్లను ఇంటింటికీ పంపిణీ చేశారు. దీంతో జనవరి 9 నుంచి ఉదయం 100 మంది, మధ్యాహ్నం మరో 100 మంది వస్తువులను కలెక్ట్ చేసుకోవచ్చు..అయితే ఈసారి కూడా నగదు పంపిణీ ఉందా లేదా అనే దానిపై ప్రతిపక్షాలతో పాటు లబ్దిదారుల్లో తలెత్తున్నాయి. 

గతేడాది పొంగల్ ప్యాకేజీ లో నగదు కూడా పంపిణీ చేశారు. అయితే ఈ సారి  ప్రభుత్వం ఆర్థికంగా కష్టాల్లో ఉంది.. నగదు పంపిణీ చేయడం కష్టమేనని తమిళనాడు ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించారు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది..అటు ప్రతిపక్షాలు, ఇటు లబ్ధిదారులను నుంచి తీవ్ర విమర్శలు ఎదరుయ్యాయి.. 

ఈ క్రమంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నగదు పంపిణీపై ఆర్థిక శాఖ మంత్రి, అధికారులతో సమావేశం అయ్యారు. నగదు పంపిణీ సాధ్యాసాధ్యాలపై చర్చిం చారు. నగదు పంపిణీకి మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని అవకాశం ఉంది.