నువ్వేదో పొడుస్తావని.. నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించలేదు: పొంగులేటి

పాలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై  కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నువ్వేదో పొడుస్తావని  పాలేరు ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించలేదని వ్యాఖ్యానించారు. డబ్బు రాజకీయాల్లో ప్రాధాన్యం కాదన్నారు.  అప్పనంగా వచ్చిన డబ్బులతో ఎమ్మెల్యే విర్రవీగుతున్నాడని.. ధ్వజమెత్తారు.  ఎన్ని డబ్బులు సంచులు తెచ్చావని.. ఆనాడు పాలేరు ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని సూచించారు.

అధికార అహంకారంతో మదం పట్టి  కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసేస్తా అంటున్నారని మండిపడ్డారు పొంగులేటి.  బెదిరించి తీసుకెళ్ళిన కాంగ్రెస్ కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి వచ్చే రోజులు దగ్గరలోనే  ఉన్నాయని చెప్పారు.   కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు పేదల ఇంటి ముందుకే వస్తాయన్నారు. పరీక్షలు కూడా నిర్వహించలేని దుస్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందంటూ ధ్వజమెత్తారు.  నేలకొండపల్లి మండల కార్యకర్తల సమావేశంలోపొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కందాల చేసిన తప్పుకు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కర్రు కాల్చి వాత  పెడతారని చెప్పారు.