ఖమ్మం రూరల్, వెలుగు : కొత్త, పాత తేడాల్లేకుండా అందరం కలిసి పనిచేద్దామని, కాంగ్రెస్ గెలుపే తమ లక్ష్యమని పార్టీ జిల్లా నేత పొంగులేటి ప్రసాద్ రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ లో ఆదివారం ఖమ్మం రూరల్ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా ఇతర పార్టీల నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీతో ఉన్న నాయకులు, కార్యకర్తలకు పొంగులేటి శీనన్న అండగా నిలుస్తారని చెప్పారు. ‘గడప గడపకు కాంగ్రెస్’ పేరిట ఊరురా ఆరు గ్యారంటీలను వివరిద్దామన్నారు. పాలేరులో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, రూరల్ మండల అధ్యక్షులు కల్లెం వెంకట్ రెడ్డి, బైరు హరినాథ్‌బాబు, మద్ది మల్లారెడ్డి, బండి జగదీశ్, కన్నేటి వెంకటేశ్వర్లు, నాగండ్ల శ్రీనివాసరావు, సర్పంచ్‌లు గోనె భుజంగ రెడ్డి, ముత్యం చిన్న కృష్ణారావు, కేతినేని వేణు, చావా శివరామ కృష్ణ, పేర్ల పాండు, మాళోతు భోజ్యా, మాజీ సర్పంచ్‌లు బోడా వెంకన్న, మద్ది వీరారెడ్డి, తోట వీరభద్రం, ఏటుకూరి సుధాకర్, ఐతగాని అంజయ్య, ఆరెంపుల రామయ్య, బానోతు హరి, యర్రంశెట్టి వెంకటరమణ తదితరులు ఉన్నారు.
నాయకన్ గూడెంలో ప్రచారం..
కూసుమంచి, వెలుగు : కూసుమంచి మండలంలో నాయకన్‌గూడెం గ్రామంలో ఆదివారం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను పొంగులేటి ప్రసాద్‌రెడ్డి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని ఆయన ప్రజలకు వివరించారు.