వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: పొంగులేటి ప్రసాద్ రెడ్డి

ఖమ్మం రూరల్, వెలుగు: ఖమ్మం జిల్లా కాంగ్రెస్​నాయకుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి బుధవారం ఖమ్మం రూరల్ మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. పొంగులేటి హర్షారెడ్డితో కలిసి తొలుత  వరంగల్ క్రాస్ రోడ్​లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ధ్వజస్తంభ ప్రతిష్ఠలో పాల్గొన్నారు. అనంతరం దానవాయిగూడెంలో యువజన కాంగ్రెస్ సమావేశంలో పాల్గొని  మాట్లాడారు. వచ్చేది కాంగ్రెస్​ప్రభుత్వమేనని, అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అధికార పార్టీ నాయకుల వేధింపు ఇంకొన్ని రోజులే ఉంటాయని, అధైర్య పడొద్దని చెప్పారు.

ALS0 READ: ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి : ఎస్పీ సంగ్రామ్‌‌ సింగ్‌‌ పాటిల్‌‌