నేలకొండపల్లి/ఖమ్మం రూరల్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ కథ ముగిసిందని, ఆ పార్టీ నేతలంతా ఇండ్లకు పరిమితమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకుడు పొంగులేటి ప్రసార్రెడ్డి చెప్పారు. నేలకొండపల్లి మండలం రామచంద్రపురం, సుర్దేపల్లి గ్రామాల్లో మంగళవారం ‘గడపగడపకు కాంగ్రెస్’ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములను ప్రజలకు వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, బీఆర్ఎస్ప్రభుత్వానికి ఇంక 50 రోజులే మిగిలి ఉన్నాయన్నారు. ప్రసాద్ రెడ్డి వెంట లీడర్లు మోహన్ రెడ్డి, పల్లెబోయిన లక్ష్మీనారాయణ, లక్కం ఏడుకొండలు, నెల్లూరి భద్రయ్య, శ్రీను, కొడాలి గోవిందరావు, స్వర్ణ, మామిడి వెంకన్న, మన్నె నగేశ్, అనంతు సత్యం తదితరులు ఉన్నారు. అలాగే ఖమ్మం రూరల్ మండలంలో ప్రసాద్‌రెడ్డి పర్యటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నాయకుడు కన్నెటి వెంకన్నను పరామర్శించారు. వేర్వేరు కారణాలతో చనిపోయిన బుర్రా వీరబాబు, గుంటి కృష్ణమూర్తి మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మండల పార్టీ అధ్యక్షుడు కల్లెం వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.