సీఎం కేసీఆర్‌ను అధికారంలోంచి గద్దె దించేందుకు తాను నాలుగు మెట్లు దిగేందుకైనా సిద్ధమేనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పీపుల్స్‌మార్చ్ పాదయాత్రలో వడదెబ్బ తగిలి అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్కను పొంగులేటి జూన్ 22 న పరామర్శించారు. నల్లొండ జిల్లా నకిరేకల్నియోజకవర్గం కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
రాష్ట్రంలోని రాజకీయలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఖమ్మంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా పొంగులేటి పార్టీలో జాయిన్ అవుతారని భట్టి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని సముద్రంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ను ఇంటికి సాగనంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పొంగులేటి అన్నారు. కేసీఆర్ వ్యతిరేక కూటమి ఏకమవుతోందని చెప్పారు.