పదేళ్లలో కేసీఆర్ లక్ష కోట్ల ఆస్తులు సంపాదించారు: పొంగులేటి

సీఎం కేసీఆర్ ను ఫామ్ హౌజ్ కే పరిమితం చేయాలన్నారు  పాలేరు  కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.  ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా  సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లు తుపాకీ రాముడు కథలు చెప్పే  కేసీఆర్ లక్ష కోట్ల ఆస్తులు సంపాదించారని..  ఐదు లక్షలకోట్ల అప్పులు చేశారని ఆరోపించారు.  రాబోయే ఎన్నికల్లో డబ్బుల సంచులతో వచ్చి ఎంత అడిగితే అంత ఇస్తారని మండిపడ్డారు . ప్రజలు ట్యాక్సులు కట్టిన డబ్బులు కొల్లగొట్టి ప్రజలకే పంచుతారన్నారు. 

Also Read : కాంగ్రెస్ నేతలు త్వరలోనే గాంధీభవన్ను అమ్ముతరు: విష్ణువర్ధన్ రెడ్డి

యాదవులు గొర్రెల కోసం డీడీలు కడితే ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతోనే  కందాల ఉపేందర్ రెడ్డి పనితీరేంటో కనిపిస్తుందన్నారు పొంగులేటి. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్, కందాల ఉపేందర్ ఒక్కటేనన్నారు.  తెలంగాణా రాష్ట్రంతో గాంధీ కుటుంబానికి అనుబంధం ఉందన్నారు. కాంగ్రెస్ ను   గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని పొంగులేటి చెప్పారు. 

ఈ సారి ఖమ్మం జిల్లా పాలేరు పోటీ ఆసక్తికరంగా మారనుంది. బీఆర్ఎస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేయనుండగా.. కాంగ్రెస్ నుంచి పొంగులేటి పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్సార్ సీపీ  నుంచి షర్మిల పోటీకి దిగనున్నారు. దీంతో పోటీ త్రిముఖ పోటీ ఖాయమని పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది.