ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టులో రిజర్వాయర్లు లేవన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కేసీఆర్ సభకు రావాలి.. వస్తే ఈ సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంటుందన్నారు. అప్పుడు దేవాలయంగా ఉన్న మేడిగడ్డ ఇపుడు బొందల గడ్డ అయ్యిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కూలిపోయింది..మరి ఆనాడు మేడిగడ్డ దగ్గర నీటిని ఎందుకు నిల్వ చేయలేదన్నారు. కనిపిస్తున్న దృశ్యాలను కూడా బీఆర్ఎస్ అంగీకరించడం లేదన్నారు.
మూడు పిల్లర్లే కాదు..మరో మూడు ప్రాజెక్టులు డౌటేనన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కొత్త ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు లేదు.. సలహాలిచ్చే హక్కే ఉందన్నారు. గత సర్కార్ ప్రాజెక్టులపై దోపిడి చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టులు తొందరగా కట్టాలనే ఆత్రుత తప్ప..క్వాలిటీని పట్టించుకోలేదన్నారు. చేవేళ్ల ప్రాజెక్టుకు పేరు మార్చడమే ఆ ప్రాజెక్టుకు శాపమన్నారు.