వరంగల్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి పనుల్లో స్పీడ్‌‌‌‌‌‌‌‌ పెంచండి: పొంగులేటి

  •     వరద ముప్పు లేకుండా నాలాలు విస్తరించాలి
  •     సూపర్‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ పనులు ఇన్‌‌‌‌‌‌‌‌టైంలో పూర్తికావాలి
  •     వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు: వరంగల్​ పర్యటనలో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించిన మేరకు అభివృద్ధి పనులను స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేయాలని వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. వరంగల్‌‌‌‌‌‌‌‌ నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై గురువారం సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌లోని తన ఆఫీసులో జిల్లా మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా వరంగల్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌, ఐఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ భూసేకరణ, ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీ, కుడా మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌, కాళోజీ కళాక్షేత్రం, జీడబ్ల్యూఎంసీ పరిధిలో రిటైనింగ్‌‌‌‌‌‌‌‌ వాల్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం, వరద నివారణ చర్యలు, నర్సంపేట్ మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీ తదితర పనులపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ 2050 జనాభాకు అనుగుణంగా వరంగల్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ రూపొందించాలని ఆదేశించారు. ఫార్మా సిటీ, ఐటీ సర్వీసెస్, మాన్యుఫ్యాక్చరింగ్‌‌‌‌‌‌‌‌ యూనిట్స్‌‌‌‌‌‌‌‌, ఎకో టూరిజం, ఎడ్యుకేషనల్‌‌‌‌‌‌‌‌ ఇన్స్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్స్‌‌‌‌‌‌‌‌, స్టేడియం, ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు, లాజిస్టిక్స్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌, టూరిజం, డంపింగ్‌‌‌‌‌‌‌‌ యార్డుల ఏర్పాటు వంటి అంశాలతో ప్లాన్‌‌‌‌‌‌‌‌ తయారుచేయాలన్నారు. 

సెప్టెంబర్ 9న కాళోజీ జన్మదినం సందర్భంగా కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రారంభిస్తారని, అప్పటివరకు పెండింగ్‌‌‌‌‌‌‌‌ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వరంగల్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. కాజీపేట – అయోధ్యాపురం ఆర్‌‌‌‌‌‌‌‌వోబీ పనుల ఆలస్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వరంగల్‌‌‌‌‌‌‌‌ సిటీకి వరద ముప్పు లేకుండా నాలాలను విస్తరించాలని, ఇందుకోసం స్పెషల్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించాలన్నారు. నాలాలను ఆక్రమించుకొని నివాసం ఉంటున్న వారిని మరో ప్రాంతానికి తరలించాలని, నాలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

 సమావేశంలో వరంగల్‌‌‌‌‌‌‌‌ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, నాగరాజు, ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌, పోచంపల్లి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బస్వరాజు సారయ్య, వరంగల్‌‌‌‌‌‌‌‌ మేయర్‌‌‌‌‌‌‌‌ గుండు సుధారాణి, మున్సిపల్ శాఖ కార్యదర్శి దాన కిశోర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, రోడ్లు మరియు భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, సీడీఎంఏ వీపీ గౌతమ్, వరంగల్, హన్మకొండ కలెక్టర్లు సత్య శారదా, పి. ప్రావీణ్య, వరంగల్ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ అశ్వినీ తానాజీ వాఖడే పాల్గొన్నారు.