తెలంగాణలో వర్షాలకు 9 మంది మృతి

తెలంగాణలో వర్షాలకు 9 మంది మృతి

తెలంగాణలో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోతుంది. సెప్టెంబర్ 1 మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది మృతి చెందారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. 

గత మూడు  రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీవర్షాలతో పలుప్రాంతాల్లో వరదల్లో చిక్కుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అలర్ట్ అయిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యలు చేపడుతోంది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు శ్రమిస్తున్నారు అధికారులు.

మహబూబాబాద్ జిల్లా బీచురాజుపల్లి, మరిపెడ, బంగ్లాలో వరదనీటిలో చిక్కుకున్న 9మందిని ఫైర్ సిబ్బంది కాపాడింది..  సూర్యాపేట జిల్లా కోదాడలో కూడా పలు వురు కాపాడారు రెస్క్యూ టీం సభ్యులు. కోదాడ ఎల్ ఐసీ ఆఫీస్ మెయిన్ రోడ్, కోదాడ బ్రిడ్జి దగ్గర , షిర్డీ సాయినగర్ లో దాదాపు 150 మందిని కాపాడి సురక్షిత ప్రాంతా లకు చేర్చారు. 

కోదాడ పరిధిలోని తొగురై గ్రామంలో వరద నీటిలో ఆగిపోయిన కారులోంచి ఇద్దరు వ్యక్తులను రక్షించారు ఫైర్ సిబ్బంది. కోదాడ చెరువు లో వరదల్లో చిక్కుకుపోయిన ఇద్దరిని బోట్ల ద్వారా రక్షించారు. మహబూబాద్ జిల్లాలో సూతరం తండా , ధర్మారంలో ఫైర్ డిపార్ట్ మెంట్ రెస్క్యూ టీం సక్సెస్ ఫుల్ పనిచేస్తోంది. సుమారు 100 మందిని సేఫ్ జోన్ కు తరలించారు.