కులగణన సర్వేతో ప్రభుత్వ పథకాలు పోవు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కులగణన సర్వేకు రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాలు ప్రయ త్నిస్తున్నాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సర్వేతో ప్రభుత్వ పథకాలు ఆగిపోవని, ప్రజలు భయాం దోళనలకు గుర్తికావొద్దని మంత్రి కోరారు. 

మరిన్ని మంచి కార్యక్రమాల కోసమే కులగణన సర్వే చేస్తున్నా మని చెప్పారు. సోమవారం సెక్రటేరియెట్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ సర్వే చేపట్టామని తెలిపారు. మంత్రులు, సీఎం అందరూ సర్వేలో పాల్గొని వివరాలు ఇచ్చారని చెప్పారు.