జనగర్జన సభను ఫెయిల్ చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆర్టీసీ బస్సులు ఇవ్వడం లేదని.. ప్రైవేట్ వాహనాలను చెక్ పోస్టులు పెట్టి అడ్డుకుంటున్నారని విమర్శించారు. వాహనాల ఆర్సీ, సీబుక్ లను పోలీసులు బలవంతంగా తీస్కుంటున్నారని ఆరోపించారు. రాత్రి నుంచి రోడ్లు బ్లాక్ చేసి భయానకర వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో ఉన్న అధికారులు బీఆర్ఎస్ కు చెంచాగిరి చేస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో 1800 వాహనాలను సీజ్ చేశారని తెలిపారు.
ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా జనం స్వచ్చందంగా వస్తారని చెప్పారు. తమ అనుచరులను చంపుతామని బెదిరిస్తున్నారని.. కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని సూచించారు. అవసరమైతే తాను రోడ్డు మీదకు వస్తానన్నారు. 15 వేల వాహనాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సభను విజయవంతం చేస్తామని చెప్పారు.
జన గర్జన సభకు వెళ్తే సంక్షేమ పథకాలు తీసేస్తామని బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు పొంగులేటి. దళిత బంధు , బీసీ బంధు , పోడు పట్టాలు , రేషన్ కార్డు తొలగిస్తామని హెచ్చరిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఎంత దూరమైనా పయనిస్తామన్నారు.