ఏదైనా జాతీయ పార్టీలోనే చేరతా : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

ఏదైనా జాతీయ పార్టీలోనే చేరతా : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

ఎర్రుపాలెం, వెలుగు: ఏదైనా జాతీయ పార్టీలోనే చేరతానని, ఈ నెలాఖరులోగా ఆ పార్టీ ఏదో వెల్లడిస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. శనివారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో పొంగులేటి క్యాంపు ఆఫీస్​ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ మాయమాటలు నమ్మి తెలంగాణ ప్రజలు రెండుసార్లు మోసపోయారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయనుకుంటే కేసీఆర్​కుటుంబసభ్యులకు మాత్రమే న్యాయం జరిగిందన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని చెప్పిన కేసీఆర్​నేటికీ అందించలేదన్నారు. రైతుల రుణమాఫీ అమలు ఊసే లేకుండా పోయిందన్నారు. ఈసారి కేసీఆర్​ మాయమాటలు నమ్మొద్దన్నారు.