ఎన్నికల కురుక్షేత్రానికి సిద్దంగా ఉన్నా : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి ఆసక్తికర వాఖ్యాలు చేశారు.  చేపలు నీళ్ళల్లో ఉండటం సర్వసాధరణం. నీళ్ళల్లో ఉండే చాప బయటకు వస్తే బతకదు. అదేవిధంగా రాజకీయ నాయకుడు ప్రజల్లో ఉన్ననాడే, వారితో మమేకమై, అభిమానం పొందిననప్పుడే  నాయకుడిగా రాణించగలుగుతాడన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు తనని వారి కుటుంబ సభ్యులుగా గౌరవిస్తున్నారని పొంగులేటి చెప్పారు.  జిల్లా ప్రజలు తన మీద చూపిస్తున్న ప్రేమతో రానున్న కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. నాలుగున్నర ఏళ్లలో ఏ పదవి లేకపోయినా, జనం నుంచి అపూర్వ స్పందన వచ్చిందంటూ పొంగులేటి కామెంట్స్‌ చేశారు. 

ఇటీవల కూడా పొంగులేటి బీఆర్ఎస్ పై సంచలన వాఖ్యాలు చేశారు. ఇన్నాళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో దక్కిన గౌరవమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్ లో దక్కబోయే గౌరవమేంటో  కూడా ఆలోచించాలన్నారు. గత నాలుగున్నరేళ్లలో ఏం ఇబ్బంది జరిగిందో తెలియంది కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో తన వెంట ఉన్న ముఖ్యనేతలంతా పోటీ చేసి తీరతారని తేల్చిచెప్పారు.