కూసుమంచి, వెలుగు : సీఎం కేసీఆర్ తెలంగాణ సంపద రూ.లక్ష కోట్లు దోచుకొని దాచుకున్నారని కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రచార కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సోమవారం పాలేరు, కూసుమంచిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా దుర్గమాత, ఆంజనేయ ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు దక్కుతాయన్నారు.
తొలి ఏడాదిలోనే హామీలన్ని అమల్లోకి వస్తాయని చెప్పారు. ఎమ్మెల్యేలకు ఊడిగం చేసే అధికారులు భరతం పడతామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మద్దినేనే స్వర్ణకుమారి, మాజీ సర్పంచ్బజ్జూరి వెంకటరెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్జూకూరి గోపాల్‌రావు, మండల అధ్యక్షుడు గురవయ్య, ఎండీ హాఫీజుద్దీన్, వెంకటరెడ్డి, సుధాకర్‌రెడ్డి, జోన్నలగడ్డ రవి, వీరభద్రం పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లోకి సర్పంచ్ మోహన్‌రావు
కూసుమంచి సర్పంచ్ చెన్నా మోహన్‌రావు, మాజీ సర్పంచ్గుండా దామోదర్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. మంళవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటరెడ్డి, గోపాల్‌రావు, సుధాకర్‌రెడ్డి, జోన్నలగడ్డ రవి, వీరభద్రం, కేశవరెడ్డి పాల్గొన్నారు.
వైరా సీటు విజయబాయిదే..
వైరా : పొత్తుల్లో వైరా సీటు పోతుందనడంలో నిజం లేదని, పార్టీ తరుపున వైరా బరిలో నిలిచేది విజయ బాయియేనని, ఆమెకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలను కోరారు. ఖమ్మం జిల్లా వైరా నియోజక వర్గంలోని కేజీ సిరిపురంలో నిర్మించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.
రెండు సార్లు కేసీఆర్ కు అధికారం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. మళ్ళీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, ఆ మాటలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరన్నారు. సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి రాగానే నెరవేర్చుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు భానోతు విజయబాయి, బొర్రా రాజశేఖర్, మచ్చా వెంకటేశ్వరరావు, మట్టూరి నాగేశ్వర రావు, కర్నాటి హనుమంతరావు ఉన్నారు.