బూర్గంపహాడ్,వెలుగు: మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వినర్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి బర్త్ డే వేడుకులను మండలంలో శనివారం ఘనంగా నిర్వహిచారు. ఈ సందర్భంగా నాయకులు, శ్రీనివాస రెడ్డి అభిమానులు సారపాకలోని పార్టీ ఆఫీసు నుంచి వందలాది బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. రెడ్దిపాలెం రామాలయం, బూర్గంపహాడ్ లోని మజీద్, మోరంపల్లి బంజర్లోని చర్చ్ లలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
మోతపట్టీనగర్ శివారులోని సమక్క సారాలమ్మ ఆలయం వద్ద మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరక్టర్ తుల్లూరి బ్రహ్మయ్య, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్ది వెంకటేశ్వర రెడ్ది కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, నాయకులు మారం వెంకటేశ్వర రెడ్ది, బిజ్జం వెంకటేశ్వర రెడ్ది, దుగ్గెంపూడి శేషిరెడ్ది, గుజ్జు క్రాంతిరెడ్ది, కోమటిరెడ్ది వెంకటరెడ్ది, చిప్పా రాజు, కైపు శ్రీనివాస రెడ్ది, మర్లపాటి నాగేశ్వర రావు, ప్రభాకర్ పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్/ పాల్వంచ/ కామేపల్లి, వెలుగు: టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి బర్త్ డే వేడుకులను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహిచారు. ఈ సందర్భంగా నాయకులు, శ్రీనివాస రెడ్డి అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వీట్స్ పంచారు. ఖమ్మం రూరల్ మండలంలో పొంగులేటి అభిమానులు, పార్టీ శ్రేణులు తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేశారు. పొంగులేటి ప్రసాద్ రెడ్డి కేక్ కట్ శిబిరాన్ని ప్రారంభించారు. పాల్వంచలో నూకల రంగారావు ఎర్రంశెట్టి ముత్తయ్య, తుమ్మల శివారెడ్డి, జాలే జానకి రెడ్డి, పండితాపురంలో డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, నాయకులు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.