ఖమ్మం కార్పొరేషన్ /కూసుమంచి వెలుగు : బీఆర్ఎస్కు కౌంట్ డౌన్ మొదలైందని, సీఎం కేసీఆర్‌కు ధైర్యముంటే103 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్‌విసిరారు. పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పొంగులేటి గురువారం మొదటిసారి ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయమాటలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ను గద్దె దించడమే తమ లక్ష్యమని, దాని కోసం ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోతానన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో ఎలాంటి వర్గాలు లేవని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నగర కాంగ్రెస్అధ్యక్షుడు మహ్మద్జావీద్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, బానోత్ విజయబాయి, మువ్వా విజయబాబు పాల్గొన్నారు.
జీపీ కార్మికులకు అండగా ఉంటా
కొన్నిరోజులుగా సమ్మె చేస్తున్న కూసుమంచి మండలంలోని పంచాయతీ కార్మికులు గురువారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. తమను పర్మినెంట్‌చేసి, జీతాలు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీపీ కార్మికులకు అండగా ఉంటానని చెప్పారు.