మంత్రి పువ్వాడ ఆజయ్ పై తాను పోటీ చేసి గెలవడం కాదు... అతనిపై బచ్చాగాన్ని పెట్టైనా గెలిపిప్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నాడని ఆయన ఆరోపించారు. మంత్రి తన అనుచరులతో సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని, ఖమ్మంలో ప్రజలు స్వేచ్చగా తిరిగే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు.
మనుషులను కూడా గౌరవించలేని వ్యక్తి పువ్వాడ అని పొంగులేటి అన్నారు. ప్రజలు తలుచుకుంటే ఎంతపెద్ద వ్యక్తి అయిన ఇంట్లో కూర్చోవాల్సిందేనని, మంత్రి పువ్వాడను ఇంటికి పంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు. అధికార అండతో మంత్రి తన సభలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని పొంగులేటి ఆరోపించారు.
తెలంగాణ ప్రజలను మాటల గారడీతో మోసం చేసి కేసీఆర్ రెండుసార్లు అధికారంలోకి వచ్చారని పొంగులేటి విమర్శించారు. మూడోసారి కూడా అదే పంథాలో అధికారంలోకి వచ్చే్ందుకు కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని కానీ ప్రజలు కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ చెప్పే మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.
రైతులకు అందించే అన్ని రకాల స్కీంలను ప్రభుత్వం రద్దు చేసిందని, ఒక్క రైతుబంధు అందించి ఏదో గొప్పపని చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని పొంగులేటి విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి ఆదాయం వచ్చే వాటిపై దృష్టి ఉంటుందే తప్పా, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు. మీబలంతో ఎవరినైనా ఎదుర్కొవడానికి తాను సిద్దంగా ఉన్నానని, అది ఎంత పెద్ద వ్యక్తులైనా సరేనని పొంగులేటి సవాల్ విసిరారు.