కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  2023 జులై 2 ఆదివారం రోజున ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న జన గర్జన బహిరంగ సభలో భాగంగా పొంగులేటి ఆ పార్టీలో జాయిన్ అయ్యారు.   

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు. పొంగులేటితో పాటుగా పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు.   అంతకుముందు సభాస్థలికి చేరుకున్న రాహుల్ గాంధీని శాలువతో సత్కరించారు పొంగులేటి. 

 జన గర్జన బహిరంగ సభకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.