అప్పుడు నన్ను.. ఇప్పుడు తుమ్మలను అవమానించారు : పొంగులేటి

బీఆర్ఎస్ లీడర్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కాంగ్రెస్ లీడర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు.  హైదరాబాద్ లోని తుమ్మల ఇంటికెళ్లిన పొంగులేటి...  తాజా పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్‌లోకి రావాలంటూ తుమ్మలను ఆయన ఆహ్వానం పలికారు. 

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన  పొంగులేటి... తుమ్మలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లుగా తెలిపారు. కార్యకర్తలతో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటానని తుమ్మల తనతో అన్నట్లుగా పొంగులేటి చెప్పారు.  బీఆర్ఎస్ లో తనతో పాటు చాలామంది నేతలను పొమ్మనలేక పొగబెట్టారని విమర్శించారు.  ముందు తనని, ఇప్పుడు తుమ్మలను అవమానించారని తెలిపారు.  

Also Read : Travel : ఈ వీకెండ్ కరీంనగర్ అందాలు చూసొద్దామా..

తనను కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని ఆహ్వానించిన పొంగులేటికి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు.  తన రాజకీయాలు ప్రజల కోసమేనని,   జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం దేవుడు తనకు కల్పించాడన్నారు .  ఏ పార్టీలో ఉన్నా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్న ఆయన  సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు.  అభిమానుల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.