ఖమ్మం: బీఆర్ఎస్ప్రభుత్వం యువతను నట్టేట ముంచిందని, సర్కార్ అసమర్థత వల్లే రెండు సార్లు గ్రూప్పరీక్షలు రద్దు చేశారని కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. పాలేరు టికెట్ఆశించిన కాంగ్రెస్ నేత రాయల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ‘కురుక్షేత్రం రాబోతుంది.
యుద్ధ సమయం వచ్చింది. కాంగ్రెస్అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రేపటి నుంచి రాహుల్, ప్రియాకం గాంధీ ఎన్నికల శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రప్రభుత్వం యువతను నట్టేట ముంచింది. సర్కార్ అసమర్థత వల్లే రెండు సార్లు గ్రూప్పరీక్షలు రద్దు చేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చిత్తశుద్ధి లేదు’ అని అన్నారు.