తెలంగాణలో పది రోజుల్లో ప్రజా రాజ్యం రానుంది : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

తెలంగాణలో పది రోజుల్లో ప్రజా రాజ్యం రానుంది : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నేలకొండపల్లి, వెలుగు :  పది రోజుల్లో వచ్చేదే ప్రజా రాజ్యం అని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.  కేసీఆర్ అనే దొరను శాశ్వతంగా బంధించి రాజకీయ సమాధి చేయాలని  ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని ముజ్జుగూడెం,అనాసాగరం, కొత్తూరు, పైనంపల్లి, రామచంద్రాపురం, సుర్దేపల్లి, బోదులబండ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.

గడిచిన పదేళ్లలో కొత్త రేషన్​ కార్డులు, దళిత బంధు, మైనార్టీ బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనత కేసీఆర్​కే దక్కిందన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా పేపర్ లీకేజీ తో,  ప్రాజెక్టుల పేరుతో  లక్షల కోట్ల ప్రజల సొమ్ము కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ వజ్జా రమ్య, రాయల నాగేశ్వరరావు, వేగినాటి లక్ష్మీనర్సయ్య, నెల్లూరి, భద్రయ్య, శాఖమూరి రమేశ్, కడియాల నరేశ్, జెర్రిపోతుల అంజని, బచ్చలకూరి నాగరాజు, బొడ్డు బొందయ్య, గడిపెల్లి రామారావు, గూడవల్లి రాంబ్రహ్మం, కడియాల  శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. 

కాంగ్రెస్ లో చేరిక

ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం రూరల్​ మండలం కాచిరాజుగూడెం, పెద్దతండాల నుంచి బుధవారం సుమారు రెండు వందల కుటుంబాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరాయి. సాయిగణేశ్​ గనర్​పొంగులేటి క్యాంపు కార్యాలయంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దతండా బీఆర్​ఎస్​ మండల మాజీ కార్యదర్శి రెడ్యా నాయక్, పెద్దతండా గ్రామ శాఖ అధ్యక్షుడు బాణోతు మోహన్, మారెమ్మ గుడి డైరెక్టర్ బోడా శారద, నాయకులు బాణోతు హుస్సేన్, రాంబాబు, ముల్సూర్, రాజు తో పాటు సుమారు 50 కుటుంబాలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాయి. కార్యక్రమంలో కాంగ్రెస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, మండల నాయకులు అజ్మీర అశోక్ నాయక్, ధారావత్ బాబు, గుడిచుట్టూ వెంకన్న, రూప్ సింగ్ పాల్గొన్నారు.

ALSO READ : బీజేపీ, బీఆర్ఎస్​ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నాయి : ఎంఎస్ రాజ్ ఠాకూర్