ఖాజీపూర్‌‌లో భూభారతి పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీం ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి

ఖాజీపూర్‌‌లో భూభారతి పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీం ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి

మద్దూరు,వెలుగు: నారాయణ పేట జిల్లా మద్దూరు మండలంలోని ఖాజీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భూ భారతి పోర్టల్ ను ప్రారంభించేందుకు నేడు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా నారాయణ పేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలొమ్, ఆర్డీఓ  రామచందర్ నాయక్ తో కలిసి బుధవారం మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

  గ్రామంలోని రెండు స్థలాలను చూసిన కలెక్టర్ ప్రైమరీ స్కూల్ ఆవరణలో ఉన్న స్థలంలో భూభారతి రెవెన్యూ సదస్సుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూ భారతి సదస్సును ప్రారంభించనున్నారు.