ఐఎన్‌‌సీ.. ఇండియన్ .. కమర్షియల్ కాంగ్రెస్‌‌గా మారింది : పొంగులేటి సుధాకర్‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌‌సీ) పార్టీ ఇండియన్ కమర్షియల్ కాంగ్రెస్‌‌గా మారిందని బీజేపీ కర్నాటక, తమిళనాడు సహ ఇన్‌‌చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయన్నారు. 

దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆదానీ అవినీతిని ప్రతిపక్షాలు తెరపైకి తెచ్చాయని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈర్ష్య అసూయతో ప్రధాని మోదీ, ఆదానీలపై రాహుల్ గాంధీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.