పాల్వంచ రూరల్, వెలుగు : కేంద్ర ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తే సహించేదిలేదని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశిట్టి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీసీ రోడ్లు, ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, ఎల్ఈడీ లైట్లు, ఇంటింటికీ బాత్రూములు,రైతు వేదికలు, కల్లాలు, ఫసల్ బీమాయోజన, పీఎం కిసాన్యోజనతోపాటు అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వంద్వారానే మంజూరయ్యాయే తప్ప బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. సమావేశంలో పార్టీపట్టణ అధ్యక్షుడు ఎం.ప్రభాకర్, గంధం ప్రసాద్, ఎం.ప్రశాంత్, లక్ష్మణ్, అజయ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.