
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరారు. జనగామలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పొన్నాలతో పాటుగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. 45 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉండి అవమానాలకు గురయ్యానని చెప్పారు.
కేసీఆర్ సీఎం అయ్యాక 3 నెలలకే రాష్ట్రంలో సకలజనుల సర్వే పేరుతో కులగణన, సమగ్ర సర్వే చేపట్టారని ఈ సందర్బంగా గుర్తుచేశారు. జనగామ నియోజకవర్గంలో కేసీఆర్ 7 రిజర్వాయర్లు నిర్మించారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని, కేసీఆర్ మూడోసారి సీఎం ఖావడం ఖాయమని పొన్నాల చెప్పారు. కాగా పొన్నాల ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.