హైదరాబాద్, వెలుగు: రోడ్డు విస్తరణ పనుల ప్రారంభానికి మోదీ వరంగల్ దాకా రావా లా? అని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. ‘ప్రధాని అధికారిక కార్యక్రమాల కోసం వస్తున్నారా? పార్టీ కార్యక్రమాల కోసమా’ అని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రజా ధనంతో పర్యటనలు చేస్తారా? అని నిలదీశారు.
‘వరంగల్‌కు తొమ్మిదేండ్లలో కేంద్రం ఏం చేసిందని ప్రధాని వస్తున్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైందో సమాధానం చెప్పాలి. ప్రధాని ముందు కేసీఆర్తల వంచి.. మాకేమీ వద్దు.. మీ ప్రేమ చాలు అన్నారు’ అని పొన్నాల అన్నారు.