
- ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న నేతలు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వరంగల్ మాజీ ఎంపీ, ఎస్‌ఎఫ్‌సీ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య కలిశారు. శనివారం బంజారాహిల్స్‌లోని జానారెడ్డి నివాసంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్ ఉభయసభల్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం, అన్ని పార్టీల నేతలను రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పించడం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత వంటి అంశాలను చర్చించుకున్నారని తెలిసింది. అంతకుముందు బంజారాహిల్స్‌లో ఎంపీ కె.కేశవరావును మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు.