కాంగ్రెస్​లో చేరెటోళ్లను బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తున్నది : మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

కాంగ్రెస్​లో చేరెటోళ్లను బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తున్నది : మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శ

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో చేరాలను కుంటున్న నేతలను బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంట్రాక్టులు ఇచ్చి బీజేపీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ యాటిట్యూడ్ వల్లే ప్రతిపక్షాల భేటీకి పిలుపురాలేదన్నారు.

బీఆర్ఎస్, బీజేపీకి ‘బీ’ టీమ్ అంటూ ఎన్సీపీ నేత శరద్ పవార్ స్వయంగా చెప్పారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. ఢిల్లీలో దోస్తీ చేస్తూ, గల్లీలో కుస్తీ లు పడుతున్నట్లు ప్రజల్ని మభ్య పెడుతున్నారని ఫైర్ అయ్యారు. 81 స్థానాల్లో గెలుస్తామని రాష్ట్ర బీజేపీ 
అధ్యక్షుడు సంజయ్ చెబుతున్నారని, దమ్ముంటే అందులో కనీసం 21 మంది అభ్యర్థుల పేర్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు.