చింతన్ శిబిర్ మీటింగ్ కు పొన్నం, సీతక్క..రాష్ట్రం తరఫున డెహ్రాడూన్​కు వెళ్లిన మంత్రులు 

చింతన్ శిబిర్ మీటింగ్ కు పొన్నం, సీతక్క..రాష్ట్రం తరఫున డెహ్రాడూన్​కు వెళ్లిన మంత్రులు 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో డెహ్రాడూన్ లో నిర్వహించనున్న చింతన్ శిబిర్ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొననున్నారు. ఇందుకోసం మంత్రులిద్దరూ ఆదివారం మధ్యాహ్నం డెహ్రడూన్ కు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ మీటింగ్​కు అన్ని రాష్ట్రాల వెల్ఫేర్ మినిస్టర్లు హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషి, అమలవుతున్న పథకాలు తదితర అంశాలపై మంత్రి సీతక్క ప్రసంగించనున్నారు.

సామాజిక న్యాయ సాధనలో, ఆయా వర్గాల సాధికారతలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీతక్క కోరనున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న చింతన్ శిబిర్ లో రాష్ట్రంలో బీసీ సంక్షేమశాఖ అమలు చేస్తున్న పథకాలు, కుల గణన, బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తారని మినిస్టర్​ కార్యాలయం వెల్లడించింది. ఈ చింతన్ శిబిర్ లో వివిధ వర్గాల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను రాష్ట్రాలు, కేంద్రం కలిసి పని చేసే అంశంపై చర్చించనున్నారు.