గంగుల కమలాకర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన పొన్నం ప్రభాకర్

మంత్రి గంగుల కమలాకర్ పై పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గంగుల కమలాకర్ లాగా తాను రాజకీయ వ్యభిచారిని కానని మండిపడ్డారు. తనను  ఔట్ డేటెడ్ లీడర్ అని అన్నారని, ఈ మాట బి. వినోద్ రావుని అన్నట్లు అనిపిస్తోందని అనుమానించారు. గంగుల గురించి కేటీఆర్ శేరు పటాక అన్నది వాస్తవం కాదా అని నిలదీశారు. సీఎం కూతురు కవిత ఒడిపోలేదా అని ప్రశ్నించారు? ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా వినోద్ రావు ఎంపీగా ఓడిపోలేదా? అని గుర్తు చేశారు. గంగుల దొంగ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. సర్టిఫికెట్ ల కోసం ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోవడం సబబేనా అని ప్రశ్నించారు. గంగుల రైతుల గురించి  పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. 

బండి సంజయ్, గంగుల ఆలయాలలో కలుసుకుంటూ తనను తిట్టుకుంటున్నారని పొన్నం ప్రభాకర్ అన్నారు. మహాశక్తి ఆలయానికి వచ్చి ప్రమాణం చేస్తా దమ్ముంటే మీరు రండని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అభ్యర్ధికి పైసలు ఇచ్చి.. బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి మంత్రి అవుదామని అనుకున్న వ్యక్తి గంగుల కమలాకర్ అని అన్నారు. 

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఒకరోజు బెల్ట్ షాప్ ల పండుగ కూడా పెట్టాలని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. దశాబ్ది దగా పేరుతో రేపు(జూన్ 22) కేసీఆర్ 10  రకాల తలల వైఫల్యాలతో దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రకటించారు. 119 నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతామన్నారు.