సైదాపూర్, చిగురుమామిడి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంతో చాలెంజ్ చేసే వాళ్లు రాజీనామా పత్రాలతో సిద్ధంగా ఉండాలని, మాజీ మంత్రి హరీశ్‌రావు అగ్గిపెట్టె రాజకీయాలు మానుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు మద్దతుగా శుక్రవారం చిగురుమామిడి, సైదాపూర్ మండల కేంద్రాల్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలుచేస్తామన్నారు. కానీ ప్రతిపక్ష లీడర్లు తమకు చాలెంజ్‌లు విసురుతూ, పిల్లి శాపనార్థాలు పెడుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బిల్లులు చెల్లించకపోవడంతో సిరిసిల్ల వస్త్రపరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లిందన్నారు .